బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 13:34:58

చందూమొండేటి డైరెక్ష‌న్ లో 'చిత్ర‌ల‌హ‌రి' బ్యూటీ

చందూమొండేటి డైరెక్ష‌న్ లో 'చిత్ర‌ల‌హ‌రి' బ్యూటీ

మెంట‌ల్ మ‌దిలో, చిత్ర‌ల‌హ‌రి, బ్రోచేవారెవ‌రురా వంటి చిత్రాల‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల‌ న‌టి నివేదా పేతురాజ్‌. ఈ ఏడాది అల వైకుంఠ‌పురం చిత్రంలో కీల‌క పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ భామ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు టాక్ న‌డుస్తోంది. స‌వ్య‌సాచి, కార్తికేయ‌, ప్రేమ‌మ్ వంటి సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాడు డైరెక్ట‌ర్ చందూమొండేటి. ఈ డైరెక్ట‌ర్ తో నివేదా లేడీ ఓరియెంటెడ్ మూవీని చేసేందుకు రెడీ అవుతుంద‌ట‌.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్  పై మార్క్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ నేడు షురూ అయింది. ఈ సినిమాలోని న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల‌పై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo