Krithi shetty | మనసు బాగోలేనప్పుడు కృతి శెట్టి ఏం తింటుందో తెలుసా?
Krithi shetty | సినీరంగంలో కొంత మంది నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. అదే కొంత మందికి మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఇండస్ట్రీలో ఎంత మంచి పాత్రలు వచ్చిన, నటన ఎంత బాగా చేసిన అదృష్టం కూడా ఉండాలి అని అంటుంటారు. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చింది కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకుపోతుంది. గతేడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ఈ చిత్ర విజయంలో 50శాతం క్రెడిట్ కృతిశెట్టికే దక్కుతుంది. ఈ చిత్రంలో కృతి తన అందం, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తరువాత వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో హ్యట్రిక్ను సాధించింది.
ఈ క్రమంలోనే కృతిని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అంటూ పిలిచారు. ప్రస్తుతం టైర్2 హీరోలకు కృతి శెట్టినే కేరాఫ్ అడ్రస్. కాగా ఇటీవలే విడుదలైన ‘ది వారియర్’ కృతి సక్సెస్ జర్నీకి బ్రేక్ వేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం సగం బడ్జెట్‌ను కూడా రికవరీ చేయలేకపోయింది. దీంతో కృతి శెట్టి కాస్త అప్సెట్ అయింది. ఇక ప్రస్తుతం ఈమె నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు సిద్దంగా ఉంది. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను షురూ చేసింది. కాగా ప్రమోషన్లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది. తనకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అంతేకాకుండా తన మనసు బాగోలేనప్పుడు ఐస్‌క్రీమ్ తింటానని చెప్పింది. ఐస్‌క్రీమ్ తింటే తన మూడు ఇట్టే మారిపోతుందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కృతిశెట్టి, సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నటిస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఇదే ఏడాది ద్వితియార్థంలో విడుదల కానుంది. దీనితో పాటు నాగచైతన్య-వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లోనూ కృతి ఎంపికైంది. ఇక ‘అచలుడు’ సినిమాతో నేరుగా తమిళంలో ఎంట్రీ ఇవ్వనుంది. నేషనల్ అవార్డు గ్రహిత సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలా దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also:
Aparichithudu Movie | ‘అపరిచితుడు’ చిత్రానికి ఆ స్టార్ హీరో నో చెప్పాడా?
Pakka Commercial | అప్పుడే ఓటీటీలోకి ‘పక్కా కమర్షియల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ajith Kumar | రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోగా నిలిచిన అజిత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

