Pakka Commercial | అప్పుడే ఓటీటీలోకి ‘పక్కా కమర్షియల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Pakka Commercial On OTT | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు గోపిచంద్. గత కొంత కాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపిచంద్‌కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. ఈ చిత్రం కమర్షియల్గానూ గోపిచంద్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘పక్కా కమర్షియల్’ విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ చిత్రం అదే రోజు నుండి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు. గోపించంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ ఘన విజయాలు సాధించాయి. ఇక ‘పక్కాకమర్షియల్’ ఫేయిల్యూర్‌తో మారుతి ఖాతాలో వరుసగా రెండు ఫ్లాప్‌లు పడ్డాయి. ప్రస్తుతం ఈయన ప్రభాస్‌తో హారర్ కామెడీ చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

