Aparichithudu Movie | ‘అపరిచితుడు’ చిత్రానికి ఆ స్టార్ హీరో నో చెప్పాడా?
Aparichithudu Movie | ఇండియా గర్వించ దగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. హీరోలతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. శంకర్ తన సినిమాల్లో ఎంటర్టైనమెంట్తో పాటు ఒక మంచి సోషల్ మేసేజ్ కూడా ఇస్తుంటాడు. ఈయన తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో ‘అపరిచితుడు’ ఒకటి. నిర్లక్ష్యం, లేజినెస్, అవినీతి , కల్తీ వలన దేశం ఎలా అభివృద్ధి చెందకుండా అలానే ఉండిపోతుందో అనే కాన్సెప్ట్‌తో శంకర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ఈయన స్క్రీన్‌ప్లే గాని, టేకింగ్ గాని నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. మూడు విభిన్న పాత్రల్లో విక్రమ్ నటన వర్ణనాతీతం. ఒక్క మాటలో చెప్పాలంటే విక్రమ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అప్పట్లో ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. ఈ సినిమాతోనే విక్రమ్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.
కాగా ఈ సినిమా కథను శంకర్ మొదట రజినికాంత్‌కు వినిపించాడట. కానీ రజిని ఈ కథను రిజెక్ట్ చేశాడట. దాంతో విక్రమ్ వద్దకు అపరిచితుడు స్క్రిప్ట్ వెళ్ళింది. విక్రమ్ కెరీర్లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోయింది. శంకర్‌కు ఉన్న క్రేజ్‌తో తెలుగులో ఈ చిత్రానికి రూ.6.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అప్పట్లో ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే ట్రేడ్ పండితుల సైతం ఆశ్చర్య పోయారు. ఫైనల్‌గా ఈ చిత్రం రూ.13.71 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్ బస్టర్ సినిమాగా రికార్డు సృష్టించింది. సదా హీరోయిన్ నటించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. త్వరలో ఈ చిత్రాన్ని శంకర్ బాలీవుడ్లో రణ్వీర్ సింగ్‌తో తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే లాంచింగ్ కార్యక్రమాలు పూర్తి చేసకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

