‘దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయండి’
ఈ నెల 29న మోత్కూర్ మండల కేంద్రంలో జరగనున్న దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం...
తుంగతుర్తి, నవంబర్ 27 : ఈ నెల 29న మోత్కూర్ మండల కేంద్రంలో జరగనున్న దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఆనాడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కొనియాడారు. ఈ బహిరంగ సభకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు తునికి సాయిలు, గుడిపాటి వీరయ్య, పూర్ణ నాయక్, వీరోజీ నాయక్, వెంకటకిశోర్, మట్టిపెల్లి వెంకట్, యాకునాయక్, చింతకుంట్ల పరమేశ్, మల్యాల రాములు, గోపగాని వెంకన్న, దుబ్బాక విజయ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయండి’
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
Offbeat | బీచ్లో గర్ల్ఫ్రెండ్కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్లో గర్ల్ఫ్రెండ్కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

