Macherla Niyojakavargam | ‘కలెక్టర్ మీద చెయ్యేస్తే గవర్నమెంట్ మీద చెయ్యేసినట్టే’.. ఆసక్తికరంగా ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్
Macherla Niyojakavargam Trailer | యంగ్ హీరో నితిన్ ప్రాధాన పాత్రలో నటిస్తున్న లెటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే నితిన్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి యాక్షన్ రోల్‌ను పోషించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలకు క్రియేట్ చేశాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ఇవాళ వైజాగ్ చాలా కొత్తగా కనిపిస్తుందిరా’ అంటూ నితిన్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ‘ఎప్పుడులేంది నన్ను బయటకి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నావ్.. సబ్జెక్ట్ ఏంటీ’ డైలాగ్‌తో కృతి ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ‘వాడు నిన్ను టచ్ చేసిన పట్టించుకోను గాని, వాడు నా ఈగోను టచ్ చేశాడు’ అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ నవ్విస్తుంది. మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్లు జరపడమే లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా కలెక్టర్‌గా నితిన్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. సముద్రఖని ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ‘ఈ రాజప్ప మీద గెలవాలంటే.. రాజప్పే అయ్యుండాలి’ అంటూ ఈయన చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల పంచులు.. వీళ్ళేమో బోయపాటి శ్రీనులా యాక్షన్.. ఇప్పుడు నేనేం చేయాలి రాజమౌళి లాగా ఎలివేషన్ ఇవ్వాలా’, ‘కలెక్టర్ మీద చెయ్యేస్తే గవర్నమెంట్ మీద చెయ్యేసినట్టే’. ‘సివిల్ సర్వెంట్ అంటే అందరూ సాఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇన్‌బుల్ట్ కమర్షియల్. డైరెక్ట్ ఎటాక్’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో క్యాథెరీన్ థెరిస్సా కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు. సినిమాటోగ్రఫి: ప్రసాద్ మూరెళ్ళ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

