టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి మంచి బేకింగ్ స్కిల్స్ (వంటకాల తయారీ) ఉన్న పర్సన్ అని తెలిసిందే. ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్నారు. తాను చేసిన వైరైటీ, టేస్టీ వంటకాలు, ఇతర ఫుడ్స్ కు సంబంధించిన పోస్ట్‌లను పెడుతూ ఉంటుంది ఆశ్రిత. ఇన్ స్టాగ్రామ్ లో ఆశ్రితకు లక్షకుపైగా ఫాలోవర్లున్నారు. హోపర్ ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది ఆశ్రిత.
ఈ జాబితాలో ఆశ్రిత 377వ స్థానానికి చేరుకుంది. ఆశ్రిత ఇన్ ప్లుయెన్సర్ (ప్రభావశీలుర) కేటగిరిలో పై స్థానంలో నిలిచింది. అంటే ఆశ్రిత ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తుందన్నమాట. ఆశ్రిత దగ్గుబాటి తన బాయ్‌ఫ్రెండ్ వినాయక్ రెడ్డిని పెండ్లి చేసుకుంది. వినాయక్-ఆశ్రిత ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్టు..రెండు కీ అప్ డేట్స్
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?