Champion | రోషన్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా చాంపియన్ లుక్ వైరల్
ఇవాళ శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshann) పుట్టినరోజు. ఈ సందర్భంగా రోషన్‌కు మూవీ లవర్స్, ఫాలోవర్లు, ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రోషన్ కొత్త సినిమాకు చాంపియన్ (Champion) టైటిల్ ఫిక్స్ చేశారు.
Roshann | రుద్రమదేవి చిత్రంతో యువ చాళుక్య వీరభద్రుడిగా సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి మెరిశాడు శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshann). ఆ తర్వాత నిర్మలా కాన్వెంట్ స్కూల్, పెళ్లి సందD సినిమాల్లో నటించాడు. ఇవాళ రోషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రోషన్‌కు మూవీ లవర్స్, ఫాలోవర్లు, ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రోషన్ కొత్త సినిమాకు చాంపియన్ (Champion) టైటిల్ ఫిక్స్ చేశారు. రోషన్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను ప్రకటిస్తూ.. మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఇప్పటివరకు మ్యాన్లీ లుక్‌లో కనిపించిన రోషన్.. ఈ సారి మాత్రం మాస్ రోల్లో కనిపించబోతున్నట్టు లేటెస్ట్ స్టిల్‌తో తెలిసిపోతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ పై చాంపియన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
చాంపియన్ కోసం రోషన్ మేకోవర్ మార్చుకున్నట్టు అర్థమవుతోంది. యాక్షన్ డ్రామా ఎలిమెంట్స్‌తో సాగే డిఫరెంట్ లవ్‌స్టోరీతో చాంపియన్ తెరకెక్కుతుంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రాఫర్. రోషన్‌తో రొమాన్స్ చేయబోయే బ్యూటీ ఎవరు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులపై త్వరలోనే క్లారిటీ రానుంది.
రోషన్ చాంపియన్ లుక్ ..
Here's wishing our 'Champ' #Roshann a very Happy Birthday.#Champion @PradeepAdvaitam @MickeyJMeyer @AshwiniDuttCh @SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/E46ztppLf9
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 13, 2023
Read Also :
Legend Saravanan | షాకింగ్ స్టైలిష్ లుక్‌లో లెజెండ్ శరవణన్.. త్వరలోనే నయా అప్డేట్
Bhuvana Vijayam | ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. ఇంట్రెస్టింగ్గా భువన విజయమ్ టీజర్
Dasara | ఉత్తరాదిన నాని దసరా ట్రైలర్ లాంఛ్.. ఇంతకీ ఎక్కడో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

