Allu Arjun | చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
Allu Arjun | టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయ్యారు. ఈ మేరకు చంచల్ గూడ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
Allu Arjun | హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయ్యారు. ఈ మేరకు చంచల్ గూడ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. మరికాసేపట్లో అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఇక అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జైలు వెనుక గేటు నుంచి అర్జున్ను అధికారులు బయటకు పంపించారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం వరకు పోలీసు ఎస్కార్ట్‌తో అల్లు అర్జున్ చేరుకున్నారు.
ఇక సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నిన్న చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు రూ. 50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో ఆయన రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
LRS | నత్తనడకన ఎల్ఆర్ఎస్! మార్చి నెలాఖరు నాటికి 10వేల కోట్ల టార్గెట్
KCR | కేసీఆర్ హయాంలో అప్పు 3.17 లక్షల కోట్లు.. కాంగ్రెస్ దుష్ప్రచారం 7 లక్షల కోట్లు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

