Actor Ali | జనసేన పార్టీవైపు అలీ చూపు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్న అలీ (Ali) రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారని తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు అలీ. మరోవైపు పవన్ కల్యాణ్ ఓ వైపు స్టార్ హీరోగా ఉంటూనే..ఇంకోవైపు జనసేన అధినేతగా వచ్చే 2024 ఎన్నికల్లో (AP Politics) ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేసే యాక్టర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటారు అలీ, పవన్ కల్యాణ్ (Pawan kalyan). కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్న అలీ (Ali) రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారని తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు అలీ. మరోవైపు పవన్ కల్యాణ్ ఓ వైపు స్టార్ హీరోగా ఉంటూనే..ఇంకోవైపు జనసేన అధినేతగా వచ్చే 2024 ఎన్నికల్లో (AP Politics) ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
తనకు అలీ అంటే ఎంతో గౌరవమని, ప్రతీ సినిమాలో అలీ ఉండేలా చూసుకుంటానని గతంలో ఓ ఈవెంట్ సందర్భంలో చెప్పుకొచ్చారు పవన్. ఈ ఇద్దరూ ఇండస్ట్రీ పరంగా, వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తున్నా..పొలిటికల్‌గా వచ్చేసరికి రెండు భిన్న నేపథ్యం ఉన్న పార్టీల్లో కొనసాగుతున్నారు.
అలీ అంటే ఎంతో గౌరవమిచ్చే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభ హోదా కానీ, కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఏపీ ఫిలిం, థియేటర్, టెలివిజన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా కానీ లేదా ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి కానీ ఇవ్వాలని అనుకుంటున్నట్టు చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఏపీలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లకుపైగా దాటినా అలీకి సంబంధించి అలాంటి నిర్ణయాలేవి తీసుకోలేదనే వాదన ఇండస్ట్రీతోపాటు రాజకీయ వర్గాల్లో కూడా ఉంది.

ఈ నేపథ్యంలో ఇపుడొక ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. పవన్ జనసేన పార్టీ (Janasena Party)ని బలోపేతం చేసే దిశగా ఫోకస్‌గా ముందుకెళ్తున్నారు. జనసేన క్షేత్రస్థాయిలో సమస్యలపై ఫోకస్ పెడుతూ ముందుకెళ్తుంది. వైఎస్సార్సీప్లో ఉన్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న అలీ..ఇక జనసేనవైపు చూస్తున్నారని జోరుగా టాక్ నడుస్తోంది.
అలీ ఒకవేళ జనసేనలో చేరితే తూర్పు లేదా పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పోటీలో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. రాజమండ్రి నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో అలీ ఆ స్థానం నుంచే టికెట్ ఆశించే అవకాశం ఎక్కువున్నట్టు పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జనసేన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాలు గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో..అలీ ఈ జిల్లాలలో ఏదో ఒక స్థానం నుంచి నిలబడితే.. ఎమ్మెల్యే కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునే ఛాన్స్ దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు జనాలు. మరి సిల్వర్ స్క్రీన్‌పై మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ పాలిటిక్స్ లోనూ కలిసి ముందుకెళ్తారా అన్నది..చూడాలి మరి.
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

