Mailurayi | నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. నిర్మాతగా శ్రీ హన్సిక!
Sree Hansika Peddireddy | హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘మైలురాయి’. తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
Sree Hansika Peddireddy | హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘మైలురాయి’. తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. యువ నటీనటులు జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లాంచ్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ శ్రీ నాగబాబు ఘనంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘మైలురాయి’ సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని, నిర్మాత హన్సిక మంచి కథతో తన కెరీర్‌ను ప్రారంభించారని కొనియాడారు. ఔత్సాహిక దర్శకుడు, యువ హీరోతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమని చెప్పారు. ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవని, అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న, ప్రియాంక, నిహారిక, సుప్రియల బాటలోనే హన్సిక కూడా పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. హన్సి ప్రొడక్షన్స్ తొలి చిత్రంగా వస్తున్న ‘మైలురాయి’ టైటిల్ పోస్టర్‌ను నాగబాబు గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోందని, త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. సహ నిర్మాత తవిటిరాజు తలచింతల మాట్లాడుతూ.. ఇదొక చక్కటి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రమని, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
హీరో జగన్ యోగిరాజు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, పోస్టర్‌కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. త్వరలోనే టీజర్, పాటలు, ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని, అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ.. హన్సి ప్రొడక్షన్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని, ‘మైలురాయి’ భావోద్వేగాలతో కూడిన లవ్ స్టోరీ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం కచ్చితంగా అలరిస్తుందని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mailurayi | నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. నిర్మాతగా శ్రీ హన్సిక!
KTR | రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు : కేటీఆర్
Spain Train Crash: డ్రైవర్లు, కంట్రోల్ సెంటర్ మధ్య సంభాషణ.. ఆడియో రిలీజ్ చేసిన స్పానిష్ మీడియా
Anirudh – Kaviya | అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్.. ప్రధాని, సీఎం విజయ్ సహా ప్రముఖులకు ఆహ్వానం!
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

