Titanic Re-Release Collections | ప్రపంచ సినీ చరిత్రలో అందమైన, అద్భుతమైన ప్రేమ కావ్యంగా చెప్పుకునే సినిమా ‘టైటానిక్’. జేమ్స్ కామెరూన్ విజన్‌కు మాయలో పడని సినీ ప్రేక్షకుడు లేడు. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా రీ-రిలీజయింది. కాగా ఈ సినిమా రీ-రిలీజ్లోనూ రికార్డులు సృష్టిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ప్రపంచ బాక్సాఫీస్‌పై సంచలనాలు నెలకొల్పుతుంది. ఎవర్గ్రీన్ కల్ట్ క్లాసిక్‌ను మళ్లీ థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు పరుగులు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పుడున్న దీని స్పీడ్ చూస్తుంటే.. మరో రెండు వారాల వరకు ఈ సినిమా హావా కొనసాగనున్నట్లు కనిపిస్తుంది.
సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ సినిమాను టీవీల్లో, ఫోన్లలో చూసుంటాం. అయినా గానీ ఇప్పటికీ టెలికాస్ట్ అవుతుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి ఎవర్గ్రీన్ క్లాసికల్ మూవీ టైటానిక్. విషాదభరిత ప్రేమకథను ఇంత గొప్పగా, పోయేటిక్‌గా జేమ్స్ కామెరూన్ తప్ప ఎవరూ తీయలేరని బల్ల గుద్ది చెప్పొచ్చు. లియోనార్డో డికాప్రియో, కేన్ విన్స్లెట్ కెమెస్ట్రీకి మంత్ర ముగ్ధుడవని ప్రేక్షకుడు లేడు.
1997 నవంబర్‌లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 13వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. బిలియన్ డాలర్ మార్కు అందుకున్న మొదటి సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల పరంగానూ ఈ సినిమా పలు రికార్డులు సృష్టించింది. అప్పట్లో ఈ సినిమా ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ అత్యధిక ఆస్కార్డులు గెలుచుకున్న రికార్డు టైటినిక్ పైనే ఉన్నాయి.
ఇక గతేడాది జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ కూడా రీ-రిలీజైంది. రీ-రిలీజ్లోనూ భారీ కలెక్షన్లు సాధించి ‘అవతార్-2’ పై మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక డిసెంబర్లో రిలీజైన అవతార్-2 మొదటి మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లను సాధిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర 2బిలియన్ మార్కును దాటేసింది. సినిమా రిలీజై రెండు నెలలవుతున్నా ఇంకా చాలా చోట్ల ఈ సినిమా హవానే కొనసాగుతుంది.