Lew Palter Passed Away | హాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు లేవ్ పాల్టర్ మరణించాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా పాల్టర్ మృతిచెందాడు. పాల్టర్కు 94 ఏళ్లు. పాల్టర్ కూతురు కేథరిన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. గతకొంత కాలంగా ఊపరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన మే 21న తనువు చాలించినట్లు పాల్టర్ కూతురు వెల్లడించింది. పాల్టర్ మరణించిన నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని కేథరిన్ మీడియాతో పంచుకుంది.
టైటినిక్ చూసిన వారందరికి పాల్టర్ సుపరిచితుడే. ఈ సినిమాలో పాల్టర్ డిపార్ట్మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్ర పోషించాడు. హాలీవుడ్ దివంగత నటి ఎల్సా రావన్ ఈ సినిమాలో ఆయనకు భార్యగా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరూ పాసింజర్లతో పాటు షిప్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతారు. పాల్టర్ టెలివిజన్ ఆర్టిస్టుగాను పలు హాలీవుడ్ షోలలో నటించాడు. ఫస్ట్ మండే ఇన్ అక్టోబర్, హిల్ స్ట్రీట్ బుల్స్, L.A.లా, ది ఫ్లైయింగ్ నన్ వంటి సినిమాలు లేవ్ పాల్టర్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.