Tiger Shroff | బాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. జాకీ ష్రాఫ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన యాక్షన్, డ్యాన్స్‌లతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను, మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. 2014లో వచ్చిన హీరోపంతి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్. ఈ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ పరుగుకు రీమేక్‌గా విడుదలైంది. పరుగు టాలీవుడ్లో ఫ్లాప్ కాగా, హిందీలో మాత్రం మంచి విజయం సాధించి టైగర్ ష్రాఫ్‌ని నిలబెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత బాఘీ, బాఘీ2 వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లిపోయాడు.కెరీర్ మొదట్లో మంచి విజయాలు సాధించిన టైగర్ ఈ మధ్య సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు.
హీరోపంతి2, గణపత్, బడే మియాన్ చోటే మియాన్, సింగం అగైన్, గణపత్: పార్ట్ 1 సినిమా సినిమాలు ఒకటికి మించి మరొకటి అల్ట్రా డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో మళ్లీ ఇప్పుడు బాఘీ సిరీస్‌పైనే నమ్మకం పెట్టుకున్నాడు టైగర్ ష్రాఫ్. ప్రస్తుతం ‘బాఘీ 4’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ మరియు సోనం బజ్వా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025 న విడుదల కానుంది. అయితే తాజాగా టైగర్ ష్రాఫ్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
టైగర్ ష్రాఫ్ తన ఫిట్నెస్, ఫన్ మిళితం చేస్తూ అభిమానులని అలరించాడు. అక్షయ్ కుమార్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ ఆ సమయంలో తన సిక్స్‌ప్యాక్ యాబ్స్‌తో పాటు బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించి సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో టైగర్ ష్రాఫ్ కేవలం బాక్సర్ ధరించి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఆయన గాల్లోకి సిక్స్ కొడుతుండగా, ఎదురుగా నిలబడి ఉన్న అక్షయ్ కుమార్ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండటం స్పష్టంగా కనిపించింది. వీడియోకు టైగర్ క్యాప్షన్ పెట్టాడు: “కోయి టెక్నిక్ నేహీ, పర్ బహుత జాన్ హై!” (టెక్నిక్ ఏమీ లేదు, కానీ బలంగా కొడుతున్నా!) అని రాసుకొచ్చాడు. దీనికి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు, మీమ్స్ వచ్చాయి. కొందరు “సిక్స్‌ప్యాక్‌తో సిక్స్ కొడతున్నావ్” అని కామెంట్ చేయగా, మరికొందరు “క్రికెట్లోనూ హీరోవే” అని ప్రశంసల జల్లు కురిపించారు. యాక్షన్, డాన్స్, ఫిట్నెస్తో పాటు ఆటలలోనూ తన సత్తా చాటుతూ అభిమానుల మనసు గెలుచుకున్నాడు టైగర్.