కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘థగ్‌లైఫ్’ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం చెన్నైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. నమ్మకద్రోహం, అహంతో కూడిన ప్రపంచాన్ని చూపిస్తూ ట్రైలర్ మొదలైంది. ఇందులో కమల్‌హాసన్ పవర్‌పుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించారు. శింబు పాత్ర ఎనర్జిటిక్‌గా ఉంది.
ఇది సాధారణ ప్రతీకార కథ కాదని, సిద్ధాంతల మధ్య పోరాటంగా భావోద్వేగభరితంగా సాగుతుందని మేకర్స్ తెలిపారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ట్రైలర్లో హైలైట్‌గా నిలిచాయి. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.