This Week OTT/Theatrical Releases | ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ప్రతి రెండు వారాలకు ఒక పెద్ద సినిమా విడుదలవుతూ వచ్చింది. భీమ్లానాయక్ నుంచి ఆచార్య వరకు ప్రతి రెండు వారాలకు ఒక సినిమా విడుదలైంది. మధ్య మధ్యలో చిన్న సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ ఏది బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. చిన్న సినిమాలు బాగానే ఉన్న పెద్ద సినిమాలతో పోటీ తట్టుకోలేక వారంలోపే థియేటర్ల నుంచి వెళ్లిపోయాయి. ఇక ప్రస్తుతం తెలుగులో కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శితం అవుతున్నాయి. గతవారం విడుదలైన ఆచార్య ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో మిడ్ రేంజ్, చిన్న సినిమాలు క్యూ కట్టాయి. నిజానికి ఈ చిత్రాలు గతంలోనే విడుదల కావాలి కానీ పెద్ద సినిమాలతో పోటీ ఎందుకుని వెనక్కి తగ్గాయి. ఈ వారం ఓటీటీ/థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
అశోకవనంలో అర్జున కళ్యాణం:
యువ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఎప్పుడూ సీరియస్ కథలతోనే ఆకట్టుకునే విశ్వక్ ఈ సారి తన జానర్‌కు సంబంధంలేకుండా హస్యాస్పద ఫ్యామిలీ ఎంటర్టైనమెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిత్ర నుంచి విడుదలైన ప్రచార చిత్రాల దగ్గర నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ వరకు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భళా తందనాన:
వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న నటుడు శ్రీ విష్ణూ. ఈయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భళా తందనాన. ఇటీవలే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. చైతన్య దంటులూరీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెస్సా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం మే6 న ప్రేక్షకుల మందుకు రానుంది.
జయమ్మపంచాయితీ:
సుమ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. తన యాంకరింగ్, ప్రాసలు, పంచ్‌లతో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటుంది. ఈమె వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈవిడ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్. ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది.
ఓటీటీ
చిన్ని:
నేషనల్ అవార్డు గ్రహిత కీర్తి సురేష్, ప్రముఖ దర్శకుడు సెల్వా రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సాని కాదియమ్. తెలుగులో చిన్ని పేరుతో విడుదల కానుంది. కీర్తి ఇప్పటివరకు చెయ్యలేని సీరియస్ పాత్రలో నటించింది. రివేంజ్ డ్రామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా మే 6నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
రాధేశ్యామ్:
ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ లవ్‌స్టోరీ రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలై భారీగా పరాజయం పాలైంది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల్లోపే అమేజాన్‌లో స్ట్రిమింగ్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 1నుంచి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ హిందీలో అదే రోజున విడుదల కాలేదు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 4నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.
ఝండ్:
విలక్షన నటుడు బాలీవుడ్ బిగ్‌బీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఝండ్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సైరాట్ ఫేం నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వం వహించాడు. నాగ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ విజయ్ బర్సే జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అమితాబ్, విజయ్ బర్సే పాత్రలో జీవించేశాడు. మార్చి 4న విడుదలై ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇక ఈ చిత్రం ఓటీటీలో మే 4 నుంచి జీ-5లో స్ట్రీమింగ్ కానుంది.
వీటితో పాటుగా
మూవీస్:
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్( కన్నడ)- మే 5(అమేజాన్ ప్రైమ్)
థార్(హిందీ)- మే 6(నెట్‌ఫ్లిక్స్)
40 ఇయర్స్ యంగ్(హాలీవుడ్)- మే 4(నెట్‌ఫ్లిక్స్)
వెబ్‌సీరిస్:
ది వైల్డ్(హాలీవుడ్) మే 6(అమేజాన్ ప్రైమ్)
స్టోరీస్ ఆన్ది నెక్ట్స్ పేజ్(హిందీ)- మే 6(డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
హోమ్ శాంతి(హిందీ)- మే 6(డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్(హాలీవుడ్)- మే 6(నెట్‌ఫ్లిక్స్)