Chiranjeevi | ఈ తమిళ యువ దర్శకుడికి చిరంజీవితో పనిచేయాలనుందట..!
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. అవకాశమొస్తే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని డైరెక్ట్ చేయాలనేది తన కల అని చెప్పాడు టాలెంటెడ్ తమిళ యువదర్శకుడు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ టాలెంట్ ఉన్న యువ దర్శకుల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటాడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj). సూర్య, ధనుష్, విక్రమ్, విజయ్ సేతుపతితోపాటు సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కూడా డైరెక్ట్ చేసి.. లీడింగ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం శంకర్-రాంచరణ్ కాంబోలో వస్తున్న ఆర్సీ 15 చిత్రానికి కథనందిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజు.
కార్తీక్ సుబ్బరాజు ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో మహాన్ ప్రాజెక్టుతో రాగా మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ యువదర్శకుడికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తెలుగు సినిమా చేయడం గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అవకాశమొస్తే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని డైరెక్ట్ చేయాలనేది తన కల అని చెప్పాడు. మొత్తానికి తన మనసులో మాటను బయటపెట్టి చిరంజీవి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజు.
చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి మంచి కథ వస్తే యువ దర్శకులతో పనిచేయడానికి రెడీ అంటున్న తరుణంలో మరి కార్తీక్ సుబ్బరాజు గురించి చిరు ఏమైనా ఆలోచిస్తాడా..? అనేది కాలానికే వదిలేయాలంటున్నారు మూవీ లవర్స్. భవిష్యత్‌లో వీరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం తప్పకుండా సమ్‌థింగ్ స్పెషల్ సినిమాగా ఉండటం పక్కా అని అప్పడే చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.

Read also : Saikumar | డైలాగ్ కింగ్ సాయికుమార్ 50 ఏండ్ల నట ప్రస్థానం.. ట్రెండింగ్‌లో స్టిల్
Read also : Venkat Prabhu | డైరెక్టర్ వెంకట్ ప్రభు-శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

