శ్రవణ్‌రెడ్డి, రియా కపూర్ ప్రధాన పాత్రల్లో దేవాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వంలో శ్యామ్ దేవభక్తుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి అజయ్ ఘోష్ క్లాప్‌నివ్వగా, సుహాస్ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విఛాన్ చేశారు. ‘కృత్రిమ మేథస్సు కథాంశంతో భారతదేశంలో రూపొందిస్తున్న తొలి చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామాగా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: అఖిల్దేవ్, సంగీతం: సాహిత్య సాగర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాసుదేవ్ పిన్నమరాజు.