Thammudu | హిట్టు, ఫ్లాప్ టాక్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు నితిన్ (Nithiin). ఈ యంగ్ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘తమ్ముడు’ (Thammudu). ఆగస్టులో హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కాంతార ఫేం సప్తమి గౌడ (Saptami Gowda) నటిస్తోంది.
వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుందట. త్వరలోనే ప్రొడక్షన్ టీం వర్ష బొల్లమ్మ పాత్రకు సంబంధించిన వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు ఇన్సైడ్ టాక్. నితిన్ మరోవైపు యువ దర్శకుడు వెంకీకుడుముల డైరెక్షన్లో VNRTrio (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
దీంతోపాటు వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) సినిమాలో కూడా నటిస్తున్నాడు నితిన్. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమో..
VNRTrio మూవీ లాంఛ్..
Few candid moments from #VNRTrio opening ceremony 🤩
Mega⭐ @KChiruTweets Garu Graced the Pooja Ceremony ✨@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/RXHc4dezHZ
— YouWe Media (@MediaYouwe) March 24, 2023