Thiruveer | ఖాళీగా కూర్చుంటే ఏముందని రిస్క్ చేసిందే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో : తిరువీర్
తిరువీర్ (Thiruveer) నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The great pre wedding Show). టీనా శ్రావ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తిరువీర్ చేసిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
Thiruveer | థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి జార్జిరెడ్డి, పలాస 1978 సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్ (Thiruveer). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The great pre wedding Show). టీనా శ్రావ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్ ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ కథ, దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తిరువీర్ చేసిన ఓ చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
తిరువీర్ తన జర్నీ గురించి మాట్లాడుతూ.. సర్వైవల్ అనేది నాకు ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది. డబ్బు వెనకాల నేనెప్పుడూ పరుగెత్తలేదు. నేను వర్క్‌తో సంతోషంగా ఉన్నానా.. అనేది నా మొదటి ప్రాధాన్యత అన్నాడు. నేను టీ కోసం నాటకాలు వేసిన రోజులు కూడా ఉన్నాయి. నా దగ్గర ఒక కాలేజ్ బ్యాగ్ ఉండేది. అందులో వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ ఉండేది. మా సార్ నువ్వు ప్రపంచాన్ని గెలిచేయొచ్చు తెలుసా..? అని అనేవాడు. వాటి (వాటర్ బాటిల్, లంచ్ బాక్స్) తో నేనెక్కడైనా తినేవాడిని.. నేనెక్కడికైనా వెళ్లిపోయేవాడిని. నాటకమైనా.. సినిమా ట్రయల్స్ అయినా వెళ్లేవాడిని. నేను ఆర్థికంగా ప్రలోభానికి లోనయ్యేవాడిని కాదు. ముందు నాకు నేను సంతృప్తిగా ఉంటానా అనేది చూసుకునేవాడినన్నాడు తిరువీర్ .
ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు నిర్మాత కొత్త వ్యక్తి. తక్కువ డబ్బులతో చేద్దామనుంటున్నాడు. తన వల్ల అయ్యేది అంతే అన్నప్పుడు నేను కో ప్రొడక్షన్‌కు వెళ్లా.. డబ్బులు తీసుకోలేదు. అది అమ్మితే డబ్బులొస్తాయి. నేను ఇంట్ల ఖాళీగా కూర్చొని మస్తు రోజులున్నా. రోల్స్ రానప్పుడు, రోల్ వచ్చాక సినిమా మొదలు కానప్పుడు సంవత్సరాలు ఖాళీగా ఉన్నా. ఇంకో 30 -40 రోజులు ఖాళీగా కూర్చుంటే ఏముందని రిస్క్ చేసిందే ప్రీ వెడ్డింగ్ షో సినిమా .. అని చెప్పుకొచ్చాడు తిరువీర్.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్..
I have known @iamThiruveeR from before the world knew me 🙂
and I am so happy to see him live his dreams!
Here is the teaser of #TheGreatPreWeddingShow
A very interesting and relatable premise which Looks like a breezy ride!
Best wishes to Thiruveer and the entire team 🤗 pic.twitter.com/oJQiPj8wbe
— Vijay Deverakonda (@TheDeverakonda) September 16, 2025
Read Also :
Harish Rai | శాండల్‌వుడ్‌లో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

