హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తికమకతాండ’. వెంకట్ దర్శకత్వంలో తిరుపతి శ్రీనివాస రావు నిర్మించారు. ఈ నెల 15న విడుదలకానుంది. గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఊరిలోని ప్రజలందరికీ మతిమరుపు వస్తే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? ఈ క్రమంలో పండే వినోదం ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆద్యంతం నవ్వులు పంచే చిత్రమిది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ‘ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం. ప్రతి పాత్ర వినోదాన్ని పంచుతుంది’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: హరికృష్ణన్, సంగీతం: సురేశ్ బొబ్బిలి, నిర్మాణం: టీఎస్ఆర్ మూవీ మేకర్స్.