Venkat Prabhu | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. దళపతి 67గా వస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతోపాటు వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో దళపతి 68 (Thalapathy 68)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. తాజాగా వెంకట్ ప్రభు టీం నుంచి ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టంట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ఇన్సైడ్ టాక్.
వీరిద్దరూ విలన్స్‌గా కనిపిస్తారని వార్తలు వస్తుండగా.. దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. తాజా టాక్ ప్రకారం ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్లో కనిపించబోతున్నాడు. నవంబర్ చివరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. పక్కా పొలిటికల్ జోనర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉండబోతుందని కూడా ప్రకటించేశాడు గతంలోనే ప్రకటించేశాడు వెంకట్ ప్రభు. పాన్ ఇండియా కథాంశంతో రానున్న దళపతి 68లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో ఫైనల్ అవగా.. మరోహీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
2000వ సంవత్సరంలో వచ్చిన ఖుషి తర్వాత విజయ్-జ్యోతిక కాంబో ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) విలన్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
Earlier Planned Things – “Shoot Supposed to Start on August 2023 & Release Planned on Tamil New Year 2024”
Recent Planned Things – “Shooting Get Starts in October 2023 & Release Planned on Diwali 2024 🔥
A Venkat Prabhu Political Ride 🥁@actorvijay @vp_offl… pic.twitter.com/7C0vUkFP9g
— Arun Vijay (@AVinthehousee) July 3, 2023