ముంబయిలో పుట్టి, పెరిగిన అందం వేదిక. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో గ్లామర్ ఫీల్డ్వైపు అడుగులు వేసింది. కుటుంబంలో కన్నడ మూలాల కారణంగా.. దక్షిణాది చిత్రసీమపై కన్నేసింది. తమిళ చిత్రం ‘మద్రాసీ’తో కెరీర్ మొదలుపెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ నటించి దక్షిణాది తారగా ఎదిగింది. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా.. వచ్చినదాన్ని మాత్రం బలంగా పట్టుకొని, తానేంటో నిరూపించుకుంది. ‘ముని’, ‘పరదేశి’, ‘శివలింగ’, ‘కాంచన 3’ తదితర హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఏడు సినిమాలతో బిజీగా ఉన్నానంటున్న వేదిక కెరీర్ ముచ్చట్లు ఇవి..
దక్షిణాదిపరిశ్రమలోని టాప్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నా. పృథ్వీరాజ్, శింబు, సిద్ధార్థ్, సూర్య, బాలకృష్ణ, ప్రభుదేవా, శివరాజ్ కుమార్, ఉపేంద్ర .. ఇలా పెద్ద పెద్ద హీరోలతో
నటించడం గొప్పగా భావిస్తున్నా.