Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి లాల్‌సలామ్ (Lal Salaam). ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. లాల్ సలామ్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను షురూ చేసిన సూపర్ స్టార్ టీం ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ సింగిల్ THER THIRUVIZHA లాంఛ్ చేసింది. సంప్రదాయ ఫ్లేవర్‌లో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
వివేక్ రాసిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజిషన్‌లో శంకర్ మహదేవన్, ఏఆర్ రెహానా, దీప్తి సురేశ్ యోగి శంకర్ పాడాడు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది.
లాల్‌సలామ్ చాలా రోజుల తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. తలైవా, ఐశ్వర్య లాల్ సలామ్ యూనిట్‌తో సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్న స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రజినీకాంత్ దీంతోపాటు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతోపాటు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తలైవా 171లో కూడా నటిస్తున్నాడు.
THER THIRUVIZHA లిరికల్ వీడియో సాంగ్..
‘THER THIRUVIZHA’ from Lal Salaam is here to kickstart the festive vibes! ☀️🌾✨ Let the rural beats ignite the celebration! 🥁🔥✨#TherThiruvizhaOUTNOW ▶️ https://t.co/4BN3YUHM3v
An @arrahman musical 🎶
Singers 🎤 @Shankar_Live @RaihanahShekar @deepthisings @iamyogi_se… pic.twitter.com/CRNArPqh8s— Lyca Productions (@LycaProductions) December 18, 2023
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023