బిగ్‌బాస్ ఫేం అర్జున్ అంబటి, చైతన్య రావు, కిషోరి దాత్రక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా చిత్ర టీజర్‌ను హీరో అల్లరి నరేష్ ఆవిష్కరించారు.
అమ్మాయిల హత్యోదంతం నేపథ్యంలో టీజర్ ఉత్కంఠగా సాగింది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించామని చిత్ర బృందం తెలిపింది. టీజర్ చాలా థ్రిల్లింగ్‌గా ఉందని అల్లరి నరేష్ తెలిపారు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ పోచంపల్లి, సంగీతం: పీఆర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలు.