Awarapan 2 | సన్నీతో ఇమ్రాన్ హష్మీ క్లాష్.. 19 ఏళ్ల క్రితం నాటి పగ తీర్చుకుంటాడా?
Awarapan 2 | ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే వీకెండ్ బాక్సాఫీస్ భారీ యుద్ధానికి వేదిక కాబోతోంది. బాలీవుడ్ అగ్ర హీరోలు సన్నీ డియోల్, ఇమ్రాన్ హష్మీ తమ మోస్ట్ అవేటెడ్ చిత్రాలతో ముఖాముఖి తలపడబోతున్నారు.
Awarapan 2 | ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే వీకెండ్ బాక్సాఫీస్ భారీ యుద్ధానికి వేదిక కాబోతోంది. బాలీవుడ్ అగ్ర హీరోలు సన్నీ డియోల్, ఇమ్రాన్ హష్మీ తమ మోస్ట్ అవేటెడ్ చిత్రాలతో ముఖాముఖి తలపడబోతున్నారు. ఇమ్రాన్ హష్మీ కెరీర్లో క్లాసిక్‌గా నిలిచిన ‘ఆవారాపన్’కు సీక్వెల్‌గా వస్తున్న “ఆవారాపన్ 2” ఆగస్టు 14, 2026న విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దిశా పటానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్ దర్శకత్వంలో విశేష్ భట్ నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్ నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా “లాహోర్ 1947” కూడా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ రెండు సినిమాలకు అంత హైప్ ఎందుకంటే.. సరిగ్గా 19 ఏళ్ల క్రితం 2007లో సన్నీ డియోల్ ‘అప్నే’, ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్’ చిత్రాలు ఒకే రోజు విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇందులో ‘ఆవారాపన్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా.. సన్నీ డియోల్ ‘అప్నే’ మాత్రం మంచి వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహా క్లాష్ పునరావృతం కావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ‘లాహోర్ 1947’ దేశభక్తి పూరిత యాక్షన్ డ్రామాగా వస్తుండగా, ‘ఆవారాపన్ 2’ ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా అలరించబోతోంది. ఇండిపెండెన్స్ బాక్సాఫీస్ పోరులో విజేతగా ఎవరు నిలుస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Keep yourself FREE this Independence Day weekend 🇮🇳 and join us on 14 Aug 2026, Awarapan 2 in cinemas 🕊️#Awarapan2 #Freedom #Shivamisback #IndependenceDay #SaveTheDate@visheshb7 @therealemraan @dishapatani @nitinrkakkar @billysiddiqi#MukeshBhatt @visheshfilms… pic.twitter.com/1ceqkSSX4w
— Vishesh Films (@VisheshFilms) April 21, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

