గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని మూడో గీతం ‘వస్తానులే..’ శుక్రవారం విడుదలైంది. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ గీతాన్ని వెంగి రచించారు. కపిల్ కపిలన్ ఆలపించారు. ఈ రొమాంటిక్ గీతంలో నాయకానాయికలు గోపీచంద్, కావ్యా థాపర్ల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. విజువల్స్ బాగున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, గోపీచంద్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్, సంగీతం: చేతన్ భరద్వాజ్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి, దర్శకత్వం: శ్రీను వైట్ల.