రుషి కిరణ్, శ్వేత, రూప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది సస్పెక్ట్’. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 21న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిదని, ఓ అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో జరిగే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయని దర్శకుడు తెలిపారు. అంతా కొత్తవాైళ్లెనా మంచి నటనను కనబరిచారని నిర్మాత కిరణ్ కుమార్ పేర్కొన్నారు. శివ యాదవ్, రజిత, మృణాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాఘవేంద్ర, సంగీతం: ప్రజ్వల్ క్రిష్, రచన-దర్శకత్వం: రాధాకృష్ణ.