దేవన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సూపర్ నాచురల్ లవ్‌స్టోరీ ‘కృష్ణలీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ఉపశీర్షిక. ధన్య బాలకృష్ణన్ కథానాయిక. జ్యోత్స్న.జి నిర్మాత. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా రెండో గీతాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల విడుదల చేశారు. ‘సూరి ఓరి సూరి’ అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రాయగా, భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించారు.
యువత కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు రావాలనే సందేశం ఈ పాటలో వినిపిస్తున్నదని, సినిమానే కాక, యువతరాన్ని కూడా ముందుకు నడిపించేలా ఈ పాట ఉన్నదని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటల: అనిల్ కిరణ్‌కుమార్ జి., కెమెరా: సతీష్ ముత్యాల, సమర్పణ: బేబీ వైష్ణవి, నిర్మాణం: మహాసేన్ విజువల్స్.