మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya). ఈయన డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తుండగా..మలయాళీ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya) ఫీ మేల్‌లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా నుంచి ‘పంచకట్టు’ సాంగ్ ప్రోమోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఏంటి సార్ ఒకే నా..అంటూ సాగే పంచకట్టు సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో (The Panchakattu Song)ను విడుదల చేశారు. ఈ పాట నాని స్టైల్ ఆఫ్ కామెడీ సీన్లతో సాగుతూ కొత్త ఫీల్‌ను కలిగిస్తుంది. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను హర్షిత్ గోలీ రాశాడు. ప్రముఖ లెజెండరీ కర్ణాటక గాయని పద్మశ్రీ అరుణ సాయిరాం (Aruna Sairam) ఈ సాంగ్‌ను పాడారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు జూన్ 10న విడుదల కానుంది. నజ్రియా నజీమ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.