Yemi Maya Premalona Song | అకీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందిన ‘ఏమి మాయ ప్రేమలోన’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌కు యూట్యూబ్‌లో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. దసరా కానుకగా విడుదలైన ఈ సాంగ్ భారీ వ్యూస్‌ను సాధిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆల్బమ్‌లో అనిల్ ఇనుమడుగు హీరోగా నటించగా, వేణి రావ్ హీరోయిన్గా నటించింది. ముఖ్యంగా, అనిల్ ఇనుమడుగు ఇందులో కథానాయకుడిగా నటించడంతో పాటు, ఈ పాటకు సాహిత్యం (లిరిక్స్) అందించడం మరియు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ అందించిన సంగీతం, దిన్కర్ కలవుల మరియు దివ్య ఐశ్వర్య గానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
కేరళలోని సుందరమైన లొకేషన్స్‌లో చిత్రీకరించబడిన ఈ పాట.. కేరళలో బోటు నడిపే ఒక అనాథ కుర్రాడి జీవితంలో, మేఘాలు కమ్ముకున్న రోజు తారసపడిన ఓ అమ్మాయి ప్రేమని గెలుచుకునే సున్నితమైన ప్రేమ కథాంశంతో తెరకెక్కింది. సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ పనితనం ఈ ఆల్బమ్‌కు హైలైట్‌గా నిలిచింది. కేరళలోని లొకేషన్స్‌ను ఆయన చూడముచ్చటగా చూపించారు. ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా, కనుల విందుగా మలచడంలో ఆయన విజయం సాధించారు. అనిల్ మరియు వేణి రావ్ జోడి స్క్రీన్‌పై చాలా సహజంగా నటించి మెప్పించారు. సుమారు పది నిమిషాల నిడివి కలిగిన ఈ ఆల్బమ్‌ను అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో యువ నిర్మాతలు అజయ్ మరియు విష్ణు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. కాన్సెప్ట్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగుండటంతో ఈ పాట యూత్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.