“ఓజీ’ సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్‌ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ పేరుతో ఓ మ్యూజికల్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నాం. ప్రప్రథమంగా ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఓజీ’ మ్యూజిక్ వినిపిస్తున్నది. ఆ సెలబ్రేషన్‌ని ఒక ఐకాన్‌గా తీసుకొని ఈ కాన్సర్ట్‌ని రూపొందించాం’ అని అగ్ర సంగీత దర్శకుడు తమన్ అన్నారు. ఏసీటీసీతో కలిసి ఆయన నిర్వహిస్తున్న మెగా మ్యూజికల్ ఈవెంట్ ‘ఓజీ టూర్ ఇండియా’ ఈ నెల 13న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుగనున్నది.
ఈ మ్యూజికల్ ఈవెంట్‌కి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో తమన్ మాట్లాడారు. ‘హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా జరుపనున్నాం. ఈవెంట్లో అందరి హీరోల పాటలూ ఉంటాయి. ఈ నెల 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్‌లో ఈవెంట్లు నిర్వహిస్తాం. నేను చేసే ప్రతి షో ద్వారా వచ్చే పారితోషికాన్ని ఛారిటీకి అందించడం నాకు అలవాటు. ఈ షోకు చెందిన వివరాలను కూడా త్వరలో ప్రకటిస్తా’ అని తమన్ అన్నారు.