శివ కందుకూరి, రాశీసింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. పురుషోత్తమ్ రాజ్ దర్శకుడు. స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ నిర్మాతలు. మార్చి 31న విడుదలకానుంది. ఇటీవల టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రెగ్యులర్ గూఢచారి చిత్రాలకు భిన్నమైన కథాంశమిది. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో తెలుగులో ఇప్పటివరకు సినిమా రాలేదని హీరో శివ కందుకూరి తెలిపారు. కథను నమ్మి గొప్ప తపనతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. చాలా మందికి ఈ కథ నచ్చిందని, తప్పకుండా హిట్ సినిమా అవుతుందని నిర్మాత రాహుల్ యాదవ్ చెప్పారు.