సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భవనమ్’. ‘ది హాంటెడ్ హౌజ్’ ఉపశీర్షిక. బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాను ఆగస్ట్ 9న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఓ భవంతి నేపథ్యంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథాంశమిదని, చక్కటి వినోదం కూడా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని నిర్మాతలు పేర్కొన్నారు. తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, మురళీగౌడ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి.