Katha Sudha | ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ మరో వైవిధ్యమైన ఆంథాలజీ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది. ‘4 టేల్స్’ పేరుతో రూపొందిన ఈ సిరీస్‌లో 4 కథలు, 4 ఎమోషన్స్, 4 సందేశాలు ఉంటాయి. సినిమా రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన ‘కథా సుధ’ కార్యక్రమంలో భాగంగా ఈ సిరీస్‌లోని మొదటి కథ ‘ది మాస్క్’ ఈ వారం ప్రీమియర్ అయింది. ఈ చిత్రం ట్రైలర్‌ను దిగ్గజ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ ‘ఆర్జీవీ’), హరీష్ శంకర్, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ లాంచ్ చేయడం విశేషం.
క్రికెట్ బెట్టింగ్‌లో సులువుగా డబ్బు సంపాదించాలని ప్రయత్నించి అప్పులపాలైన యువకుడు ఆ అప్పులు తీర్చడానికి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఎదుర్కొన్న ఆపదలు, పరిస్థితులు ఈ కథాంశం. చిన్న కథలోనే సస్పెన్స్, డ్రామా, డార్క్ హ్యూమర్‌ను మేళవించి దర్శకుడు బుల్లి తెరపై సినిమాటిక్ అనుభవాన్ని అందించిన విధానం అద్భుతంగా నిలిచింది.‘నరుడి బ్రతుకు నటన’ ఫేమ్ రిషికేశ్వర్ యోగి సమర్పణలో ‘కథా గని పిక్చర్స్’ బ్యానర్‌పై కొత్తపల్లి సురేష్ దర్శకత్వం, నిర్మాణం చేసిన ఈ చిత్రం అక్టోబర్ 12, 2025 (ఆదివారం) నుంచి ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రావన్ నిట్టూరి, గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు తీసుకున్న పాయింట్, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మలిచిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. సాంకేతికంగా చిత్రం ఉన్నతంగా నిలిచింది. ఛాయాగ్రహణం: అక్షయ్ వసూరి, సంగీతం: విశాల్ భరద్వాజ్, ఎడిటింగ్: రిషికేశ్వర్ యోగి. సహ నిర్మాతలు: బేబీ విరాన్ష, దీపిక అలోల; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ద్రువ్ చిత్రణ్. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. మిగిలిన కథలు కూడా త్వరలో విడుదల కానున్నాయి.
The Mask a thrilling tale of secrets and suspense 😷😳
Unmask the truth today!
Streaming NOW on @etvwin 🎬#TheMask #KathaSudha #ETVWin pic.twitter.com/HHUcZxQvT0— ETV Win (@etvwin) October 12, 2025