రోహిత్‌వర్మ, రియా సుమన్ జంటగా క్రేజీ కింగ్స్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నజీర్ జమాల్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు విజయ్ కనకమేడల క్లాప్‌నివ్వగా, రామ్‌ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యే కథాంశమిదని, అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తామని దర్శకుడు తెలిపారు.
నిర్మాతగా తెలుగులో తనకిది తొలి చిత్రమని, మంచి కథ కుదిరిందని నిర్మాత నజీర్ జమాల్ పేర్కొన్నారు. నిఖిల్ దేవేదుల, అక్షర, హరీష్ ఉత్తమన్, నవీన్ నేని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రఘుతు, సంగీతం: మణిశర్మ, సంభాషణలు: రాకేందుమౌళి, దర్శకత్వం: గోవిందరెడ్డి చంద్ర.