థాయ్‌లాండ్‌లో డబుల్ ఇస్మార్ట్
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్'. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ముంబయిలో షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు.
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ముంబయిలో షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది. ఇందులో హీరో రామ్, సంజయ్‌దత్‌పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.
ఈ చిత్రంలో సంజయ్‌దత్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. థాయ్‌లాండ్ షెడ్యూల్లో రామ్, సంజయ్‌దత్‌పై తీసే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

