హాలీవుడ్ యాక్షన్ డ్రామా ‘క్రావెన్ : ది హంటర్’ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి వస్తున్న సూపర్‌హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా గురించి దర్శకుడు చందూర్ మాట్లాడుతూ ‘ఇందులో ముఖ్యమైన పాత్ర పేరు సెర్గీ. చెడ్డవారైన తన ఇద్దరు పిల్లల్నీ అతడు చంపేస్తాడు. ఆ కోపమే ఈ కథకు ఆయువుపట్టు. ఆద్యంతం యాక్షన్ ఎలిమెంట్స్‌తో అలరించే సినిమా ఇది.’ అని తెలిపారు. అరియానా డీబోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్, రస్సెల్ క్రౌ తదితరులు ఇందులో కీలక పాత్రధారులు.