Nagarjuna | ది ఘోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది..వైల్డ్ డాగ్ సినిమా గుర్తు రాదు..నాగార్జున చిట్ చాట్
ది ఘోస్ట్ (The Ghost) అక్టోబర్ 5న (బుధవారం) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున మీడియాతో చిట్ చాట్ చేశాడు.
అక్కినేని నాగార్జున (Nagarjuna), ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). అక్టోబర్ 5న (బుధవారం) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున మీడియాతో చిట్ చాట్ చేశాడు.
సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం..
ఈ సినిమా ప్రాథమిక కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రవీణ్ నాకు కథ చెప్పిన వెంటనే సినిమా చేయాలనే క్యూరియాసిటీ కలిగింది. నా పాత్ర చుట్టూ సాగే కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భావోద్వేగాలతో సాగే యాక్షన్ పార్టుతో నన్ను చాలా ఆకర్షించింది.
ఈ చిత్రంలో యాక్షన్ సీన్ల కోసం శిక్షణ తీసుకున్నా. నాతోపాటు సోనాల్ చౌహాన్ శిక్షణ తీసుకుంది. స్టైలిష్ యాక్షన్ పార్టుకు ఎమోషన్స్ జోడించబడిన తీరు అద్బుతంగా ఉంటుంది. నేను సినిమా చూశా..చాలా బాగా నచ్చింది.
చిరంజీవితో పోటీ గురించి..?
గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాల విడుదల ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. రెండు సినిమాలూ పండగకు విడుదలవుతుండటంతో పెద్ద హిట్ అవుతాయని నా నమ్మకం. గాడ్ ఫాదర్ కూడా చాలా బాగుంది చిరంజీవికి గారికి శుభాకాంక్షలు
ప్రవీణ్ సత్తారుతో కలిసి పని చేయడం ఎలా ఉంది..?
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు నాతో చాలా కాలంగా ప్రయాణిస్తున్నాడు. నేను అతనితో పనిచేయాలనుకున్నా. ప్రవీణ్ ఈ కథతో నా దగ్గరకొచ్చాడు. నేను కొన్ని రోజుల క్రితం ఈ సినిమా చూసి ప్రవీణ్ పని తీరుకి షాక్ అయ్యా. ప్రవీణ్ సత్తారు పనితనం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. కొన్ని ప్రాంతాల్లో సొంతంగా విడుదల చేయాలనేది ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం ఖచ్చితంగా నిర్మాతలకు సహాయపడుతుంది. ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుని…మంచి వసూళ్లను సాధిస్తున్న విశ్వాసం ఉంది.
వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ మధ్య తేడాపై మాట్లాడుతూ..రెండు సినిమాలు భిన్నమైనవి. కథ, యాక్షన్, బ్యాక్ డ్రాప్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. రెండు సినిమాల్లో నా పాత్రల స్వభావం వేరు. ఈ సినిమా చూస్తున్నపుడు అసలు వైల్డ్ డాగ్ గుర్తుకు రాదన్నాడు.
వందవ సినిమా పరిస్థితేంటి..?
స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. నేను వందవ సినిమా కోసం ఏ కథ ఎంపిక చేస్తాననేది కాలం నిర్ణయిస్తుంది.
Read Also : Hari Hara Veera Mallu | స్పీడు పెంచిన క్రిష్..‘హరిహర వీరమల్లు’పై తాజా అప్డేట్
Read Also : O Pari music video | దేవీ శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో అదిరింది..
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

