టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున (Nagarjuna) లీడ్ రోల్ చేస్తున్న ప్రాజెక్టు ది ఘోస్ట్ (The Ghost). చందమామా కథలు, పీఎస్వీ గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే నాగ్, ప్రవీణ్, సోనాల్ టీం దుబాయ్‌లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేసిన స్టిల్స్ ఆన్లైన్లో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఈ క్రేజీ సినిమాపై అప్డేట్ ఒకటి వచ్చింది.
ది ఘోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. స్పెషల్ కేక్ కట్ చేసిన చిత్రయూనిట్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్లో ఓ వీడియో షేర్ చేసుకుంది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రలో సోనాల్ చౌహాన్ ఓ వైపు అందాలు ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తూనే..మరోవైపు యాక్షన్ అవతార్ లో కనిపించబోతున్నట్టు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న స్టిల్ చెబుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
IT'S A WRAP for the Shoot of @iamnagarjuna's #TheGhost
In Theatres on October 5th. pic.twitter.com/iqfWpYQsFM
— Suresh Kondi (@SureshKondi_) August 8, 2022