‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, జశ్విక జంటగా రూపొందుతున్న చిత్రం ‘తెలుసా మనసా’. వైభవ్ దర్శకుడు. వర్షా ముందాడ, మాధవి నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల ప్రముఖ నిర్మాత ‘దిల్’రాజు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్‌స్టోరి ఇది.
బెలూన్స్ అమ్ముకునే అబ్బాయికి, హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసే అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ ఈదర, ఎడిటర్: పాపారావు.