SAHAA Trailer | టాలీవుడ్ నుంచి మరో ప్రేమకథ.. ఆసక్తికరంగా ‘సహ’ ట్రైలర్!
Shiva Kumar Kasaram | టాలీవుడ్లో మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది. యువ నటులు శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ (SAHAA Life of Sanju).
SAHAA Trailer | టాలీవుడ్లో మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది. యువ నటులు శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ (SAHAA Life of Sanju). నిశాంత్ దోటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మించారు. ఇందులో వ్రజన పాండ్య, మహిపాల్, సునీల్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 4న వైభవంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
సంజు అనే ఒక యువకుడి జీవిత ప్రయాణమే ఈ చిత్రానికి ప్రధాన ఆధారం. తన జీవితంలో ఎదురైన తొలిప్రేమ, బ్రేకప్ ఇచ్చే బాధ, మధుర జ్ఞాపకాలు, దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఇందులో ఎంతో సహజంగా చూపించారు. ఇది కేవలం ఒక సినిమాగా కాకుండా ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునే భావోద్వేగాల ప్రయాణంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను సంయుక్తంగా విడుదల చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

