Baby | టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) హీరోగా నటిస్తోన్న మూవీ బేబి (Baby). విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా.. విరాజ్ అశ్విన్ మీడియాతో చిట్‌చాట్ చేశాడు.
వాస్తవిక ప్రపంచంలోని వ్యక్తులను ప్రతిబింబించే మూడు ప్రధాన పాత్రల చుట్టూ బేబి కథ తిరుగుతుంది. ఈ సినిమాలో విరాజ్ అనే కాలేజీ స్టూడెంట్‌గా నటిస్తున్నా. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినప్పటికీ.. ప్రజెంటేషన్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. ‘బేబీ’ క్లైమాక్స్ అనూహ్యంగా ఉంటుంది. ఇప్పటికే బేబి నుంచి లాంఛ్ చేసిన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ (Baby Trailer)ను విడుదల చేశారు.
ఆనంద్ దేవర కొండ, వైష్ణవి చైతన్య మధ్య చిన్న నాటి నుంచి ఉన్న ఇష్టం కాస్తా ప్రేమగా మారడం, ఆ తర్వాత వైష్ణవి కాలేజ్ స్టడీస్ కోసం టౌన్‌కు రావడం, కాలేజీలో విరాజ్ అశ్విన్ పరిచయం కావడం.. ఆ తర్వాత ముగ్గురు మధ్య ఎలాంటి ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడిచిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై ఫ్రెష్ ఫీల్ అందించేలా సాగుతున్న బేబి ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
బేబి నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఓ రెండు మేఘాలియా, దేవరాజా పాటలు నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. బేబి టీజర్ కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ దీంతోపాటు గమ్ గమ్ గణేశాలో కూడా నటిస్తున్నాడు.
బేబి ట్రైలర్..
ప్రేమిస్తున్నా లిరికల్ వీడియో సాంగ్..
దేవరాజా లిరికల్ వీడియో సాంగ్..
ఓ రెండు మేఘాలిలా లిరికల్ వీడియో సాంగ్..
బేబి టీజర్.. వీడియో