కోలీవుడ్ (kollywood ) స్టార్ హీరో సూర్య (Suriya)కు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రేంజ్లో అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొత్త చిత్రం ఈటీ (ET) ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్‌చాట్ చేశాడు సూర్య. బాలీవుడ్ (Suriya) స్క్రీన్‌పై టాలెంట్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ..మేం చేసిన పనిని బాలీవుడ్ చర్చించుకోవాలి. అంతేకానీ బాలీవుడ్‌కు వెళ్లి మనల్ని మనం నిరూపించుకోవాలని అనుకోవడం లేదన్నాడు.
ఒకవేళ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే కూతుళ్ల (Daughters )ను సర్వ్ చేయాలని అడుగుతాం..కానీ కొడుకుల (Sons)ను అడగం. అలా ఎందుకు జరుగుతుంది..? మార్పు అనేది మన దగ్గర నుంచే మొదలు కావాలని… వుమెన్స్ డే సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా సూర్య చెప్పుకొచ్చాడు. అంతేకాదు చాలా అంశాల పరంగా చూస్తే..దక్షిణాది సినిమాలపై, బడ్జెట్‌పై ప్రేక్షకుల్లో ఉన్న క్లారిటీతో పోల్చుకుంటే బాలీవుడ్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టు ఫీలవుతుందని అన్నాడు సూర్య.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఈ విషయాన్ని సూర్య ప్రస్తావించడం నిజంగా ఆసక్తికర విషయమే అని నెటిజన్లు, ఫాలోవర్లు అభిప్రాయపడుతున్నారు. హోటళ్లలో పురుషులు బేరర్లుగా సర్వ్చేసినపుడు, అదే పని ఇళ్లలో కూడా ఎందుకు చేయరని అంటున్నారు.