Stunt Design category In 100th Oscars | సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ ఒకటి. ఈ అవార్డు దక్కించుకుంటే చాలు జన్మ ధన్యమైందనుకుంటారు సినీ ప్రముఖులు. అయితే వారికి గుడ్ న్యూస్ తెలుపుతూ.. ఆకాడమీ కమిటీ కొత్త కేటగిరీ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ‘స్టంట్ డిజైన్’ (Stunt Design category) జాబితాలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా వెల్లడించింది. 2027 నుంచి విడుదల కానున్న చిత్రాలను ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
స్టంట్లు ఎప్పుడూ సినిమా మాయాజాలంలో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఆస్కార్‌లో కూడా చోటు సంపాదించాయి. అకాడమీ ఒక కొత్త వార్షిక అవార్డును “అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్” పేరుతో ప్రవేశపెట్టింది—2028లో జరిగే 100వ ఆస్కార్ల నుంచి మొదలై, 2027లో విడుదలయ్యే చిత్రాలను గౌరవిస్తూ ఈ అవార్డు ఇవ్వబడుతుందంటూ అకాడమీ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఎక్స్ వేదికగా కొత్త పొస్టర్‌ను పంచుకుంది. ఇందులో హాలీవుడ్ సినిమాలు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాలతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ ఉన్న పోస్టర్‌ను పంచుకుంది.
Stunts have always been part of the magic of movies. Now, they’re part of the Oscars.
The Academy has created a new annual award for Achievement in Stunt Design—beginning with the 100th Oscars in 2028, honoring films released in 2027. pic.twitter.com/lpHen9Qk9l
— The Academy (@TheAcademy) April 10, 2025