‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే సాగర్ నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. ఈ చిత్రాన్ని జూలై 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. శనివారం చిత్రంలోని ‘హే మేఘాలే’ అనే పాటను విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్నందించిన ఈ గీతాన్ని రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. శ్రీహర్ష ఎమ్మానీ రచన చేశారు. ఈ సందర్భంగా ఆర్కే సాగర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను ఐపీఎస్ అధికారి విక్రాంత్‌గా కనిపిస్తా.
నిజాయితీ, ధైర్యం కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కథగా మెప్పిస్తుంది. యాక్షన్‌తో పాటు కథలోని సామాజిక సందేశం ఆకట్టుకుంటుంది’ అన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన పోలీస్ కథ ఇదని దర్శకుడు శశిధర్ చెప్పారు. మిషా నారంగ్, ధన్యబాలకృష్ణ, వీవీ గిరిధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్.