Thankyou Movie Pre-Release Event | అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న చైతన్య హ్యట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన ‘థాంక్యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రం జూలై 8న విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఈ చిత్రం రెండు వారాలు పోస్ట్ పోన్ అయింది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ డేట్‌ను వెల్లడించారు.
థాంక్యూ ప్రీ రిలీజ్ వేడుకను జూలై 16న వైజాగ్‌లోని సర్ సీఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరుపనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రేయాస్ గ్రూప్ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. థాంక్యూ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. లేటెస్ట్గా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఛాయగ్రహకుడిగా పనిచేశాడు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు.
Gear Up to feel the Magical World Of Love ❤️
Join us to Celebrate #ThankYouTheMovie Pre Release Event on 16th July @ 5PM 🤩@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @BvsRavi #MalvikaNair @avika_n_joy @SaiSushanthR @adityamusic @shreyasgroup @SVC_official pic.twitter.com/h9SaEHKv7v
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2022