Thamma Movie | నేషనల్ క్రష్ రష్మిక మందన, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆదిత్య సర్పోదర్ రూపొందించిన హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma). ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 25.11 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేగాకుండా ఆయుష్మాన్ ఖురానా కెరీర్లో మొదటిరోజు ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా ‘థామా’ చిత్రం నిలిచింది. మరోవైపు వీకెండ్ వస్తుండటంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.
#Thamma enjoys a terrific opening day…
⭐️ Emerges as the third-highest opener for #MaddockFilms, after #Stree2 and #Chhaava.
⭐️ Also ranks as the second-highest opener in the Maddock Horror Comedy Universe [#MHCU], after #Stree2.
⭐️ #Thamma is the biggest opener for… pic.twitter.com/HVoGD0eSqx— taran adarsh (@taran_adarsh) October 22, 2025