అనీష్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేకంగా అలరించాయి. థియేటర్లలో స్పీకర్లు కాలిపోయే సంగీతం ఈ సినిమాకు నేనివ్వలేదు. ప్రేక్షకుల మనసులు కదిలిపోయే సంగీతం ఇచ్చాను. అది రేపు సినిమాలో వింటారు. ఇదిచాలా కొత్త కంటెంట్. ఇందులో అనిరుధ్ పాడిన ‘హాయ్ రే..’ పాటకు మంచి స్పందన వచ్చింది. మిగతా పాటలు కూడా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటాయి’ అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పారు. ఈ పాటను అబ్బాయిలందరికీ డెడికేట్ చేస్తున్నానని కథానాయిక అనస్వర రాజన్ పేర్కొన్నారు. ఇంకా హీరో అనీష్, డైరెక్టర్ మహేశ్, కొరియోగ్రాఫర్ ఫాల్గుణి కూడా మాట్లాడారు.