రామ్‌చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. శంకర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. భారీ యాక్షన్ హంగులతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు సంగీత దర్శకుడు తమన్. డిసెంబర్ 20న ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ముందుకొసున్నదని, ఇప్పటి నుంచి సినిమా రిలీజ్ వరకు వరుసగా అప్డేట్స్ ఉంటాయని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. తమన్ ట్వీట్‌తో రామ్‌చరణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం బుధవారం రెండో పాటను విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు, సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్, దర్శకత్వం: శంకర్.